నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా 'కార్తికేయ 2' శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబడు తోంది. కృష్ణతత్వానికి అడ్వెంచర్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ ఈ ఫాంటసీ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ కార్తికేయ 2 అదరగొడు తోంది. తొలిరోజు హిందీలో 157 షోస్ పడ్డాయి. కేవలం రూ. 7 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. అయితే హిట్ టాక్ తో రెండో రోజు అనూహ్యంగా పుంజుకుంది. ఆదివారం 245 షోస్ పడ్డాయి. కలెక్షన్స్ రూ. 28 లక్షలకు పెరిగాయి. అంతే దాదాపు 300 శాతం గ్రోత్ అన్నమాట. ఇక సోమవారం కార్తికేయ 2 హిందీ వర్షన్ షోస్ 274 కి పెరిగాయి. దీంతో పాటు కలెక్షన్స్ పెరగనున్నాయి. మొత్తానికి... నిఖిల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa