ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీస్మార్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 03:16 PM

డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటవారసుడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "తీస్మార్ ఖాన్". 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కళ్యాణ్ జి గొనగ డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాద్ లోని ది వెస్టిన్ లో జరగబోతుంది. ఈ ఈవెంట్ కు యంగ్ హీరోలు సుధీర్ బాబు, 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతోనైనా ఆది హిట్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa