హీరో కల్యాణ్ రామ్ నటించి నిర్మించిన చిత్రం బింబిసార. ఈ చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వేరు వేరు కాలాలకు సంబంధించిన కథను ఆసక్తికరంగా నడిపించడంలో వశిష్ఠ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా కోసం జరుగుతున్న సెట్ నిర్మాణం, డాన్సులు, ఫైట్లు కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ పై మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.