నిఖిల్ సిద్దార్ధ్ లీడ్ రోల్ లో నటించిన "కార్తికేయ 2" ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్తికేయ 2 మూవీ టీం వరస సక్సెస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కార్తికేయ 2 మూవీ టీం గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సక్సెస్ మీట్ కు దిల్ రాజు, అల్లు అరవింద్, కార్తికేయ 2 మూవీ టీం అంతా పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... కార్తికేయ 2 విడుదల వాయిదా పడడానికి చాలామంది తన పేరును కారణంగా చూపించారని, ఇందులో మీడియాకు ప్రధాన పాత్ర ఉందని చెప్పారు. సినిమా అంటే తనకు ప్రాణమని, సినిమా కోసం ఏదైనా చేస్తానని, ఒక సినిమా హిట్ అవ్వాలని సినీరంగంలో ఉన్నవారందరూ కోరుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా వారికీ దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు మాత్రమే ప్రచురించాలని, అంతేకాని కేవలం సబ్ స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం నిరాధారమైన వార్తలను రాయవద్దని, తెలిస్తే రాయండి లేకుంటే మూసుకోండి అంటూ ఘాటుగా మాట్లాడారు.