పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమా 50 శాతం వరకు షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత కరోనా తీవ్రత కారణంగా మరియు పవన్ కల్యాణ్ రాజీకీయాలులో బిజీ కావడంతో సినిమా షూటింగును ఆపేశారు.దాంతో ఈ సినిమా షూటింగు ఆలస్యమవుతోంది.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.