సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి 'మీరే హీరోలా ఉన్నారు' అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ కలిసి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది.