భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం 'రౌద్రం రణం రుధిరం' తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్ 2, గాలివాన, పేపర్ రాకెట్ మరియు హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్ ని రూపొందించిన ZEE5 ఇప్పుడు 'ATM' అనే టైటిల్ తో మరో వెబ్ సిరీస్ ని రూపొందిస్తుంది. ఈ సిరీస్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విజేత VJ సన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు VJ సన్నీ పుట్టినరోజు సందర్భంగా, అతని పాత్రను పరిచయం చేసే వీడియో గ్లింప్సె ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సిరీస్ లో జగన్ అనే పేరుతో ఫుల్ మాస్ అవతార్‌లో VJ సన్నీ దోపిడీ కేసులో బుక్ అయిన 26 ఏళ్ల యువకుడిగా నటించాడు. దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ మరియు హరీష్ శంకర్ సమర్పణలో హర్షిత్ రెడ్డి మరియు హన్షిత ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.