విజయ్ దేవరకొండ, అనన్యా పాండేల పాన్ ఇండియా మూవీ "లైగర్" నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 20వ తారీఖున సాయంత్రం ఐదు గంటల నుండి గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్, మోతడక లో లైగర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని ప్రకటించారు. ఐతే, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారనే దానిపై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా మూవీగా రూపొందిన ఈ మూవీలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.