కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత దూళిపాళ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని రెండవ సింగిల్ 'చోళ చోళ' ఆగస్ట్ 19 సాయంత్రం 6 గంటలకు విడుదల కానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. చియాన్ విక్రమ్ ఉన్న ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేసారు. ఈ పాట తెలుగు వెర్షన్‌ను అనంత శ్రీరామ్ రాయగా, మనో మరియు అనురాగ్ కులకర్ణి స్వరాలు అందించనున్నారు.
'పొన్నియిన్ సెల్వన్' కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.