త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తాజగా ఇప్పుడు ఈ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుండి 'జింతాక్' అనే మొదటి పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. భీమ్స్ సిసెరోలియో కంపోస్ చేసిన ఈ మాస్ సాంగ్ ని ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ పాడారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.