హను రాఘవపూడి డైరక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం "సీతారామం". అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలై క్లాసిక్ గా నిలిచింది.
చూసిన ప్రతి ఒక్కరూ సీతారామం సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సినీ తారలు కూడా మినహాయింపు కాదు. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఒక తెలుగు సినిమాను చూసి చాలా బాగుంది అంటూ మెచ్చుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. లేటెస్ట్ గా ఈ మూవీపై , నటీనటులపై ప్రశంసలు కురిపిస్తూ, టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందుకు సీతారామం టీం కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.
రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి విశాల్ చంద్ర సంగీతం అందించారు.