టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28'అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. తాజాగా ఈరోజు, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఎక్సైటింగ్ సర్ ప్రైజ్, ఈరోజు సాయంత్రం 'SSMB 28' సినిమా గురించి సాలిడ్ అప్‌డేట్ రాబోతోంది అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ అప్‌డేట్ ఏంటో తెలుసుకోవాలని మహేష్ అభిమానులు అండ్ సినీప్రేమికులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఐటీ మంత్రిపాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |