కృష్ణుడి జన్మదినోత్సవం "శ్రీకృష్ణ జన్మాష్టమి"ని పురస్కరించుకుని సీతారామం మేకర్స్ ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, సీతారామంలోని తరలి తరలి అనే సాంగ్ యొక్క పూర్తి వీడియోను రేపు విడుదల చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేసారు. తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో రేపు ఈ పాట వీడియో విడుదల కాబోతుంది.
హను రాఘవపూడి డైరెక్షన్లో ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రష్మిక మండన్నా కీరోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.