విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా భారతీయ సినీ ఇండస్ట్రీకి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ పరిచయం కానున్నారు. కొన్ని రోజులకు ముందు మైక్ టైసన్ ఈ సినిమా ప్రమోషన్ లో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు వీల్‌చైర్లో మైక్ టైసన్ కూర్చొని కదల్లేని పరిస్థితుల్లో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. వెన్నునొప్పి, సయాటికా సమస్యలతో ఆయన బాధపడుతున్నారని సమాచారం.