ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB రిలీజ్ డేట్ పై బిగ్ బ్లాస్టింగ్ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 05:48 PM

దాదాపు పదకొండేళ్ల తదుపరి మళ్ళీ పట్టాలెక్కబోతున్న సూపర్ హిట్ డైరక్టర్ హీరో కాంబో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. దీంతో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవ్వబోతున్నట్టు తెలిపి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసారు.
ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com