కమల్ హాసన్ నటించిన కొత్త చిత్రం "విక్రమ్". ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఆపై ఓటిటిలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ తో దూసుకుపోయింది.
లేటెస్ట్ గా విక్రమ్ తెలుగు ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ కొచ్చింది. అదికూడా చిన్న ట్విస్ట్ తో. అదేంటంటే, ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే విక్రమ్ మూవీ కేవలం US సబ్ స్క్రయిబర్స్ కి మాత్రమే. ఇండియా మరియు చైనా లో వాళ్ళకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమ్ మూవీని చూసే అవకాశం లేదన్నమాట.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కమల్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలు పోషించారు.