టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం తీస్మార్ ఖాన్. కళ్యాణ్ జి గొనగ డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
ఆది ఈ సినిమాలో స్టూడెంట్ గా, రౌడీగా, రౌడీ ఆఫీసర్ తీస్మార్ ఖాన్ గా మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజైన ట్రైలర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19వ తేదీన అంటే రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాతోనైనా ఆది సాయికుమార్ హిట్ ట్రాక్ ఎక్కాలని , సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.