డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పాన్ ఇండియన్ డిబట్ మూవీ "లైగర్" . ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న లైగర్ మూవీకి సంబంధించి ఆన్లైన్ బుకింగ్ 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు బుక్ మై షో, పేటీఎమ్ యాప్స్ లో లైగర్ టికెట్స్ ను ఇరవైవ తేదీ నుండి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, విషు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.