ఇటీవల విడుదలై ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న "కార్తికేయ 2" సినిమాతో డైరెక్టర్ చందూ మొండేటి పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. ఇండియన్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కార్తికేయ ను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, వారు మెచ్చేలా తెరకెక్కించిన చందూకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
లేటెస్ట్ గా చందూ మొండేటి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, భారతదేశం గర్వించదగ్గ అమోఘమైన నటుడు అమితాబ్ బచ్చన్ ను కలిసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చందునే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, తనను బ్లెస్ చేసినందుకు కృతజ్ఞతలను తెలియచేసాడు. అలానే అమితాబ్ ను కలవడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం అని కామెంట్ చేసారు.