దేశంలోనే తొలి స్టంట్ ఉమన్ గా 'సనోబర్ పర్దివల్లా' పేరు తెచ్చుకుంది. ముంబైకి చెందిన సనోబర్ కు సాహసాలు, విన్యాసాలు చేయడమంటే ఇష్టం. కరాటేలో బ్లాక్ బెల్టు, జిమ్నాస్టిక్స్, ఈతలో పూర్తి నైపుణ్యాలు సంపాదించింది. 2003లో వచ్చిన 'భూత్' సినిమాతో మొదలైన ఆమె స్టంట్ ప్రయాణం 'లాల్ సింగ్ చడ్డా' వరకు కొనసాగుతూ వచ్చింది. ఆమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు స్టంట్ డబుల్ గా పనిచేసింది.