పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "ఖుషి" సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సంపాదించే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా "ఫస్ట్ డే ఫస్ట్ షో". జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు కథను అందించారు.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సంచితా బసు హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.
పవర్ స్టార్ బర్త్ డేను పురస్కరించుకుని ఆరోజున థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన వెన్నెల కిషోర్ తో FDFS మూవీ టీం కలిసి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనుదీప్, హీరో శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ వంశీధర్ పాల్గొనగా, కొంచెంసేపటి క్రితమే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం చాలా ఫన్నీ గా సాగినట్టు తెలుస్తుంది. ఫుల్ ఇంటర్వ్యూను త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa