ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సాలార్ మూవీ సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలోకి రానుందని మూవీ మేకర్స్ అధికారకంగా ధృవీకరించారు. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa