అ!, కల్కి, జాంబీరెడ్డి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాను చాటుకున్న విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈసారి ఒక సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
మన పురాణాల్లోని రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడి మీద ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం "హను - మాన్". చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జా ఇందులో హీరోగా నటిస్తున్నారు. 'అంజనాద్రి' ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం ఇంకో మూడ్రోజుల్లో ఈ మూవీ టీజర్ విడుదల కావొచ్చని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే, ఆగస్టు 23వ తేదీన తేజ సజ్జా పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మూవీ నుండి టీజర్ రావొచ్చని లేక మరేదైనా గ్లిమ్స్ వీడియో అయినా రావొచ్చని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి మేకర్స్ తేజ సజ్జా బర్త్ డేకు ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారో!