పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండల తొలి పాన్ ఇండియా మూవీ "లైగర్" పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 25 వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కలెక్షన్స్ నెంబర్ పై విజయ్ చెప్పిన జోస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లైగర్ మూవీ కలెక్షన్లను తాను 200 కోట్ల నుండి స్టార్ట్ చేసి అంతకు పైగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చాలా నమ్మకంగా చెప్పారు. లైగర్ సినిమా ప్రమోషన్స్ కు అన్ని ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే, విజయ్ జోస్యం నిజంగా నిజమయ్యేలా కనిపిస్తుంది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ నిర్మించిన ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.