2022లో విడుదలై ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటిగా పేరు ప్రఖ్యాతలు, భారీ కలెక్షన్లు సాధించిన సినిమా "కేజీఎఫ్ 2". రేపు అంటే ఆదివారం సాయంత్రం ఐదున్నరకు కేజీఎఫ్ 2 తెలుగు సినిమా ప్రముఖ జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.
ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలిపేందుకు జీ తెలుగు ఛానెల్ చాలా వినూత్నంగా, కూసింత భారీగా ఆలోచించింది. 100అడుగుల కేజీఎఫ్ 2 పోస్టర్ అన్ వీల్ చేసారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవి బస్రుర్ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్టుతో నిర్మించింది.