బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలే "ధాకడ్" సినిమాతో ప్రేక్షకులను పలకరించి, వారిని మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. తదుపరి పీరియడ్ పొలిటికల్ డ్రామా "ఎమర్జెన్సీ" తో కంగనా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో కంగనా ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, అటల్ బిహారి వాజ్పేయ్ పాత్రలో శ్రేయాస్ తాల్పడే నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మరొక కీలకపాత్ర ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. అదే పుపుల్ జయకర్. ఈ పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తుంది.
ఇండియన్ పాలిటిక్స్ లో ఒక మచ్చు తునకలా మిగిలిపోయే ఎమర్జెన్సీ సమయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కంగనా డైరెక్ట్ చేస్తుంది. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.