ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా టాక్ షోకు సహజంగా సినీ సెలెబ్రిటీలు హాజరై తమ మూవీ ప్రమోషన్స్ చేస్తుంటారు. లేకపోతే సినీ ఎక్స్పీరియన్స్, పర్సనల్ విషయాలు ఇలా పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.
లేటెస్ట్ గా ఈ వారం విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో ఇండియన్ టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు జాతి గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు ఈ షోకు హాజరైనట్టు తెలుస్తుంది. ఈ టాక్ షోలో పాల్గొన్న తొలి స్పోర్ట్స్ ప్లేయర్ సింధునే.
ఆలీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు చాలా కూల్ గా, ఎంతో జోవియల్ గా సమాధానం ఇచ్చింది సింధు. మీకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు అనే ప్రశ్నకు సింధు చాలామంది ఉన్నారు అని సమాధానం ఇవ్వగా, అప్పుడు ఆలీ ఒక్కరి పేరు చెప్పమని అడుగుతాడు. అప్పుడు సింధు వెంటనే ప్రభాస్ అని సమాధానం ఇస్తుంది. బిగ్ స్క్రీన్ పై కనిపిస్తారా? అని అడిగినప్పుడు ఏమో ఫ్యూచర్ లో జరగొచ్చేమో అని ఆడియన్స్ ను కన్ఫ్యూషన్ లోకి తోసేసింది.