బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటవారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన సోనమ్ కపూర్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈరోజు సాయంత్రం సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోనమ్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ కు తెలిపింది.
బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాను 2018లో వివాహమాడిన సోనమ్ ఈ ఏడాది ఏప్రిల్ లో సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నన్సీ ని ఎనౌన్స్ చేసింది. సోనమ్ ప్రెగ్నన్సీ టైం లో తీయించుకున్న బేబీ బంప్ ఫోటోషూట్లు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేసాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa