చందూ మొండేటి డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఉత్తరాది ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసింది. చాలా తక్కువ ధియేటర్లతో మొదలైన కార్తికేయ షోస్ ఇప్పుడు కేవలం నార్త్ లో వెయ్యికి పైగా థియేటర్లలో రన్ అవుతూ, అటు విశ్లేషకులను, ఇటు మూవీ టీం ను ఇద్దరినీ షాక్ కు గురి చేస్తుంది.
ప్రస్తుతం నార్త్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మా సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుండి ఇంత బిగ్ అప్లాజ్ వస్తుందని టీంలో ఎవ్వరూ కూడా అస్సలు ఊహించలేదు. థియేటర్ కొచ్చి సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.. కార్తికేయ టీం నుండి ఇంకా మంచి సబ్జెక్ట్స్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన మరిన్ని సినిమాలు వస్తాయని చెప్పారు.
![]() |
![]() |