"లైగర్" సినిమాతో ఫస్ట్ టైం ఒక ఆసియన్ సినిమాలో నటిస్తున్నాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం,ఈ సినిమాలో విజయ్ కు టైసన్ కు మధ్య భీకరమైన ఫైట్ ఐతే ఉండాల్సిందే.
లేటెస్ట్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ పై ఇంటరెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే, నటనలో అంత పర్ఫెక్ట్ కానీ టైసన్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న క్రమంలో విజయ్ ముఖంపై గట్టి పంచ్ ఇచ్చినట్టు నటించాల్సి ఉంది. కానీ, టైసన్ పంచ్ పవర్ విజయ్ ముఖాన్ని తాకడంతో దిమ్మతిరిగిపోయిందట. ఇక, ఆ రోజు మొత్తం కూడా నొప్పితో బాధపడుతూనే ఉన్నాడట.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.