ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన 'సొంతం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన నటి నమిత. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నమిత ఆపై వరస తెలుగు సినిమాలలో లీడ్ హీరోయిన్ గా నటించింది. తదుపరి తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. బాలయ్య సింహ సినిమాలో సింహమంటి చిన్నోడే పాటతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నమిత 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరి ని ప్రేమించి పెళ్లాడింది.
మే 10న తన 41వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రెగ్నన్సీని ఎనౌన్స్ చేసిన నమిత లేటెస్ట్ గా ట్విన్ బేబీ బాయ్స్ కు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానుల దీవెనలు, ప్రేమాభిమానాలు తన బిడ్డలకు ఉండాలని రిక్వెస్ట్ చేసింది. అలానే తన డాక్టర్స్ టీం కు స్పెషల్ థాంక్స్ చెప్పింది.