నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా నటించిన "కార్తికేయ 2" ఆగస్టు 13వ తేదీన విడుదలై సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో, అద్దిరిపోయే రివ్యూ రేటింగ్స్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ నంబర్స్ ను నమోదు చేస్తుంది.
విశేషంగా కార్తికేయ హిందీ వెర్షన్ కు ఉత్తరాది ఆడియన్స్ నుండి ఊహించని అద్భుతమైన స్పందన వస్తుంది. మైథాలజీ కాదు ఇది మన చరిత్ర అంటూ ఈ సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, హాలిడే, వర్కింగ్ డే అనే తేడా లేకుండా రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ, థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది ఈ సినిమా. తొలి రోజు 7 లక్షలతో మొదలైన కలెక్షన్లు ఆ తరవాతి రోజుల్లో వరసగా 28 లక్షలు, 1.10 కోట్లు, 1.28 కోట్లు, 1.38కోట్లు, 1.64కోట్లు, 2.46 కోట్లు గా ఉత్తరాదిన తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి.