విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల తొలి పాన్ ఇండియా మూవీ "లైగర్" ప్రమోషన్స్ కు దేశవ్యాప్త ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ సినిమాను చూడొద్దంటూ, బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై విజయ్ స్పందిస్తూ, ఇలా మాట్లాడారు. తమ సినిమాను స్టార్ట్ చేసేముందు వరకు ఇలాంటి బాయ్ కాట్ బాలీవుడ్లు లేవని, లాక్ డౌన్ టైం లో ఇలాంటివి మొదలయ్యాయని చెప్పారు. అక్కడి గొడవ గురించి తనకు పూర్తిగా తెలియదని అన్నారు. బాహుబలి సినిమాను భారతదేశ ప్రజలకు చేరువ చేసిన కరణ్ జోహార్ అయితేనే తమ సినిమాకు సరైన న్యాయం చేస్తారనిపించి, హిందీలో ఆయనను విడుదల చెయ్యాలని కోరామని, అందులో తప్పేమి లేదని చెప్పారు. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా మేజర్ సిటీలను సందర్శిస్తున్న లైగర్ టీం కు వేలాది మంది ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వారి కోసం మేము సినిమాలు చేస్తున్నామని, కంప్యూటర్ ముందు కూర్చుని ట్వీట్లు కొట్టే బ్యాచ్ తాము కాదని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |