ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధా కొంగర డైరెక్షన్ లో సూర్య, దుల్కర్ సల్మాన్‌ మల్టీస్టారర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 07:10 PM

కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర సూరరై పొట్రు/ఆకాశం నీ హద్దు రా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత, ఈ స్టార్ దర్శకురాలు తన తదుపరి చిత్రాన్ని కెజిఎఫ్ సినిమాని నిర్మింయించిన హోంబాలే నిర్మాతలతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సౌత్‌లో వరుస సూపర్‌హిట్‌లతో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న సూర్య, దుల్కర్ సల్మాన్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. అంతేకాకుండా స్టార్ హీరో సూర్య కథ కూడా వినకుండా ఈ సినిమాకి ఓకే చెప్పాడని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా రియలిస్టిక్ డ్రామా గా తెరకెక్కనుంది అని సమాచారం. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్-ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com