పెళ్లి చూపులు, గీతాగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. హీరోగా పరిచయమైన అనతి కాలంలోనే పాన్ ఇండియా సినిమా "లైగర్"ను చేసి అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసాడు.
వరల్డ్ వైడ్ గా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న లైగర్ మూవీ కోసం విజయ్ నిర్విరామంగా ప్రచారం చేస్తూ తెగ కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవిని ఫిలిం ఇండస్ట్రీ సింహం (లయన్) గా పేర్కొన్నాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను టైగర్ (పులి) గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి తన తండ్రి తనకు చిన్నప్పటి నుండి చాలా చెప్పేవారని, ఆయనే తన ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు.