ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ "లైగర్" బాలీవుడ్ లో మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల కాబోతుందని లేటెస్ట్ బజ్. ఆలస్యమంటే... మరీ లేట్ గా కాదుకానీ, ఒక్క రోజు తేడాతో అంటే ఆగస్టు 26వ తేదీన ఉత్తరాది ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోందట. ఐతే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రం ఆగస్టు 25నే విడుదల కాబోతుంది.
ఈ విషయం హిందీ ఆడియన్స్ ను నిరాశ పరిచినా, మరో విషయం మాత్రం కాస్తంత ఊరటనిస్తోంది. అదేంటంటే, ఆగస్టు 25వ రోజున పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్ తో లైగర్ మూవీ హిందీ ఆడియన్స్ ను థ్రిల్ చెయ్యనుంది.
మరి, హిందీ వెర్షన్ లైగర్ విడుదల పై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
![]() |
![]() |