నిన్న సాయంత్రం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతుల మీదుగా విడుదలైన చోళ చోళ సాంగ్ యూట్యూబులో 5 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
ఇండియన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ లో చియాన్ విక్రమ్ ,ఐశ్వర్యారాయ్ బచ్చన్ , కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, మృణాళిని రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్త బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి టీజర్ రిలీజై ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకుంది.