హీరో కం సపోర్టింగ్ ఆర్టిస్ట్ అల్లరి నరేష్ ను వరస ఫ్లాప్ ల నుండి బయట పడేసి హిట్ ట్రాక్ ఎక్కిచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల. విజయ్ డైరెక్షన్లో నరేష్ చేసిన 'నాంది' మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తదుపరి ఇదే కాంబోలో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ కు మేకర్స్ ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. అంతేకాక నరేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. "ఉగ్రం" పవర్ఫుల్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో నరేష్ టైటిల్ కు తగ్గట్టు చాలా ఫియర్స్ ఫుల్ అవతార్ లో కనిపిస్తున్నాడు.
మజిలీ, టక్ జగదీశ్ వంటి విభిన్న లవ్ స్టోరీలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa