ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, దేశవ్యాప్త సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్పరాజ్ ఆగమనం కి ఈ రోజుతో బీజం పడింది. అంటే, పూజా కార్యక్రమాలతో ఈ రోజే పుష్ప ది రూల్ అధికారికంగా ప్రకటింపడింది. అంటే, ఇక త్వరలోనే పుష్పరాజ్ మరియు టీం డ్యూటీ ఎక్కబోతున్నారన్నమాట.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ చిత్రానికి DSP సంగీతం అందిస్తుండగా, రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మిగిలిన నటీనటుల విషయాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa