ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్నా కానీ, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మెగా అభిమానులను సస్పెన్స్ లో ఉంచారు RC 15 మూవీ టీం. శంకర్ డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ... RC 15పై రాక్ సాలిడ్ క్లారిటీ ఇచ్చి, మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపారు. అదేంటంటే, ప్రేక్షకాభిమానులను అలరించడానికి ఈ మూవీ నుండి త్వరలోనే ఒక కీలక అప్డేట్, ఫస్ట్ లుక్ రాబోతున్నాయని, ఈ మేరకు డైరెక్టర్ శంకర్ ను తాను రిక్వెస్ట్ చేసానని చెప్పుకొచ్చారు. ఇంకేముంది ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టు టాక్. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa