తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమవుతుందని తెలియజేసేందుకు చిత్ర నిర్మాతలు సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షెడ్యూల్ కోసం చెన్నైలో ఒక పోలీస్ స్టేషన్ సెట్‌ను మూవీ మేకర్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.