చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లోనే కాకుండా ఈ సినిమా నార్త్ రీజియన్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.