ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB28' హిందీలో విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 05:40 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 28న భారీగా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ ఒక స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సామాచారం. అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. SSMB28 సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa