ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ సజ్జాకు 'హను - మాన్' మూవీ టీం స్పెషల్ బర్త్ డే విషెస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 06:15 PM

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జా నటిస్తున్న కొత్త చిత్రం "హను - మాన్". సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ "జాంబిరెడ్డి" హీరో - దర్శకుడు కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది.
లేటెస్ట్ గా ఈ రోజు హీరో తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. పల్లెటూరి యువకుడిలా , సూపర్ నాచురల్ లుక్ లో తేజ సజ్జా చూడడానికి చాలా బావున్నాడు.
మన పురాణాల్లోని రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడి మీద ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమృత హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa