కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం "తిరుచిత్రంబలం" మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో "తిరు"గా విడుదలైన ఈ మూవీ తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ రెండు ఓటిటి పార్ట్నర్స్ ను ఖరారు చేసుకుందని తెలుస్తుంది. తిరుచిత్రంబలం పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటీలు నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ సంస్థలు కొనుగోలు చెయ్యడంతో, త్వరలోనే ఆ రెండు ఓటిటీలలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
మిత్రన్ ఆర్. జవహర్ డైరెక్షన్లో డిఫరెంట్ లైఫ్ జర్నీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. నిత్యామీనన్ కీరోల్ లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.