టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమాగా, కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ, తెలుగు బై లింగువల్ గా ఒక మూవీ రూపొందబోతున్న విషయం అందరికి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయని డైరెక్టర్ వెంకట్ ప్రభు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.
ఈ సినిమాలో చైతూకి జోడిగా కృతిశెట్టి నటిస్తుండగా, SS స్క్రీన్స్ నిర్మిస్తుంది. త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa