ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్షన్ స్టార్ అర్జున్ పేరు బయటపెట్టి హీరోయిన్ సంచలనం

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 20, 2018, 03:18 PM

దేశ వ్యాప్తంగా ఉధృతం అయిన #మీటూ ఉద్యమం లైంగిక వేధింపులకు పాల్పడిన, అసభ్యంగా ప్రవర్తించిన పలువురు స్టార్స్ భాగోతాలు బట్టబయలు చేస్తోంది. తాజాగా మరో అతిపెద్ద స్టార్ పేరు బయటకు వచ్చింది. సౌత్ ఇండియాలో యాక్షన్ హీరోగా పేరు గడించడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సార్జా మీద తాజాగా ఆరోపణలు వచ్చాయి.


కన్నడ నటి శృతి హరిహరన్ అర్జున్ సార్జా షూటింగ్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేశారు. ఇటీవల విడుదలైన 'కురుక్షేత్రం'లో శృతి హరిహరన్ అర్జున్‌కు జోడీగా నటించిన నటించిన సంగతి తెలిసిందే.కురుక్షేత్రం' సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపించారు. సినిమాలో రొమాంటిక్ సీన్ రిహార్సల్ జరిగే సమయంలో అతడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.


నేను అర్జున్ సార్జా సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి వ్యక్తితో నటించే అవకాశం దొరికినపుడు చాలా సంతోష పడ్డాను. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో అంతా బాగానే ఉంది. ఈ చిత్రంలో ఆయన భార్య పాత్ర పోషించాను. ఆ రోజు మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఓ డైలాగ్ తర్వాత ఇద్దరం కౌగిలించుకోవాలి. రిహార్సల్ జరుగుతుండగా అతడి ప్రవర్తన భిన్నంగా అనిపించింది అని శృతి హరిహరన్ తెలిపారు.రొమాంటిక్ సీన్ రిహార్సల్ జరుగుతుండగా ఇద్దరం డైలాగులు చెప్పుకున్నాం. అర్జున్ ఎలాంటి ముందుస్తు సూచన లేకుండా, నా అనుమతి తీసుకోకుండా హగ్ చేసుకున్నాడు. నా వీపు మీద చేయి వేసి కిందకి మీదకు అదో రకంగా టచ్ చేస్తూ రుద్దాడు. ఆ తర్వాత నన్ను దగ్గరగా లాక్కున్నాడు.... అని శృతి హరిహరన్ తెలిపారు.


తాను చేయాల్సిందంతా చేసేసి తర్వాత దర్శకుడితో దీన్ని ఫోర్‌ప్లే సీన్లో వాడితే ఎలా ఉంటుంది అని అడిగాడు. అతడు అలా చేయడంతో ఆశ్చర్య పోయాను. రియాల్టీ కోసం ఇలా చేశాననే విధంగా కవర్ చేశాడు. కానీ అలా చేయడం పూర్తిగా తప్పు. అతడి ఉద్దేశ్యం ఏదైనా సరే అది ప్రొఫెషనల్‌గా చేస్తే బావుండేది.... అని శృతి హరిహరన్ తెలిపారు.అర్జున్ చేసిన ఆ పని చూసి అసహ్యం వేసింది. చాలా కోపం వచ్చింది. కానీ ఆ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కెమెరా రోల్ అయ్యే ముందు రిహార్సల్ చేయడం అవసరమే. అలా చేయడం వల్లే సీన్ పర్ఫెక్టుగా వస్తుంది. కానీ ఇద్దరి మధ్య ఈ విషయంలో ఒక అండస్టాండింగ్ అనేది ఉండాలి. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరి కాదన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa