విభిన్నతను, వైవిధ్యాన్ని కోరుకునే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సినిమాలే కాదు వాటి టైటిల్స్ కూడా యూనిక్ గా ఉండాలని కోరుకుంటారు. బద్రి, బాచి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, టెంపర్... ఒక్కసారి ఆయన డైరెక్ట్ చేసిన మూవీ టైటిల్స్ పరిశీలిస్తే, చాలా క్యాచీగా, సింపుల్ అండ్ షార్ట్ గా ఉంటాయి.
లేటెస్ట్ గా ఆయన డైరెక్ట్ చేసిన మూవీ "లైగర్". చాలా డిఫరెంట్ గా, వినగానే అటెన్షన్ గ్రాస్ప్ చేసే విధంగా ఉన్న ఈ టైటిల్ ముందుగా అనుకున్నది కాదంట. ముందుగా ఈ సినిమాకు ఫైటర్, టైగర్, లయన్... ఇలాంటి టైటిల్స్ అనుకుంటుండగా, ఇవేవి పూరీని ఫుల్ గా సాటిస్ఫై చెయ్యలేకపోయాయట. ఆఖరికి పూరీనే "లైగర్" టైటిల్ ను చూజ్ చేసి మూవీ టీం అందరికి తెలుపగా అందరు ఫంటాస్టిక్ గా ఉందని అన్నారట. దాంతో ఆ టైటిల్ నే సినిమాకు ఫిక్స్ చేసారంట.
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన అంటే రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa