అవతార్ మూవీ రిలీజై ఇప్పటికే 13 ఏళ్లు గడిచిపోగా.. దీనికి మరో 3 సీక్వెల్స్ రానున్నాయి. కాగా, సీక్వెల్2 ను త్వరలోనే ప్రారంభించనున్నారు. కాబట్టి ఇప్పుడు తీయబోయే సీక్వెల్ చూడాలంటే ముందుగా రివిజన్ అవసరం. పైగా చాలామంది మొదటి భాగాన్ని టీవీల్లోనే చూశారు. కానీ ఇలాంటి గ్రాఫిక్స్ మూవీని థియేటర్‌లో చూస్తేనే కిక్ ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 23 నుంచి ఇండియా వైడ్‌గా 'అవతార్' మూవీని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.