ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెబ్బా పటేల్ "ఓదెల రైల్వేస్టేషన్" ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 05:51 PM

'కుమారి 21F' ఫేమ్ హెబ్బాపటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "ఓదెల రైల్వేస్టేషన్". ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకు కథను అందించగా అశోక్ తేజ్ డైరెక్ట్ చేసారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మించారు. హెబ్బా పటేల్, వసిష్ఠ ఎన్ సింహ, పూజితా పొన్నాడ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 2002లో ఓదెల అనే చిన్న గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ రేప్ చేసి ఆపై మర్డర్ చేసి చంపేసే క్రూరమైన సైకోల గురించి చూపించారు.
ఈ మూవీ తెలుగు ఓటిటి 'ఆహా'లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. ఈ నెల 26 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa